Friday, July 30, 2010

రక్తదానం!!!

నేనేదో రక్తదానం గురించి స్పీచ్ చెప్తున్నాను అనుకోవోదు , నాకు దానికి ఒక చిన్న relation వుంది .....

నాకు ఎందుకో కాలేజీ డేస్ నుండి బ్లడ్ donate చేయాలి అనేది తీరని కోరికగా వుండేది .... నా కోరిక తీర్చడానికే ఏమో మా కాలేజీ వాళ్ళు ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టేవాళ్ళు ...అల ఫస్ట్ year లోమొదటి సాహసం చేసాం . నాతోపాటు ఇంకో అమ్మాయి కూడా వుండేది .దానికి నాకన్నా ఎక్కువ పిచ్చి ..... కాని విషయం ఏమిటి అంటే మా క్లాసు మొత్తంలోబ్లడ్ ఇవడానికి పిలిస్తే మేము ఇద్దరమే వుండేవాళ్ళం ....మేము ఇలా names ఇవగానే మా administrative ఆఫీసర్ ఒకడు ఉండేవాడు , మమల్ని fullగా పొగిడేవాడు .....అందర్నీ ఒకరకంగా తిట్టేవాడు కూడా అనుకోండి ...ఇంకా మావాళ్ళంతా మమల్ని శత్రువుల్ని చూసినట్లు చూసేవాళ్ళు ....కొంచెం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మాదగ్గరికి వచ్చి ,ఎందుకే మీకివన్ని?? అంటూ బుధి చెపటానికి ప్రయత్నిచేవాళ్ళు ....
అసలే మేము మా sir పొగిడేసరికి ఆంజనేయస్వామిలా ఉబ్బిపోయి ఆకాశం లో కూర్చొని ఎవరిమాట వినేవాళ్ళం కాదు ,ఇంకా వాళ్ళ మాటలు ఎందుకు చెవికి ఎక్కుతాయి చెప్పండి ...
ఇంకా అసలు రోజు రానేవోస్తుంది .... ఆ రోజు అందరు మమల్ని యుదానికి వెళ్ళే సైనికుల్ని చూసినట్లు చూసేవాళ్ళు ..మేము ఇచే buildup అలాంటిది ... అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ చేసేపని weight చెక్ చేస్తారు , తర్వాత బ్లడ్ టెస్ట్ , ఇవన్ని చేసాక మనం బ్లడ్ ఇవోచూ లేదో డిసైడ్ చేస్తారు ,ఫస్ట్ టైం కదా , చాలహ్యాపీ గా వాడు చేసే అడ్డమైన టెస్ట్అన్ని చేయించుకున్నాం .... ఫైనల్ గా వాడు వచ్చి , ఇద్దర్ని పోమన్నాడు , ఇదరికి పట్టలేనంత ఏడుపు వోచేసిందంటే నమ్మండి , విషయం ఏంటో వాడు చెప్పక ముందే వాడిని బ్రతిమాలడం మొదలు పెట్టం .... ఎలాగైఅన బ్ల్లోడ్ తీస్కోమని ...
వాడేమో మీ దగగ్ర తీస్కోకుడదు అని కదమ్మా ,నీకేమూ weight తక్కువ వుంది ,ఆ అమ్మయికేమూ బ్లడ్ తక్కువగా వుంది , మీరు మా requirements కి మ్యాచ్ అవ్వలేదు అన్నాడు .... ఐన మేము వినకుండా వాడిని అడుగుతూనే వున్నాం ..... అసలు విషయం ఏమిటి అంటే ,ఇప్పుడు బ్లడ్ ఇవ్వకుండా వెనక్కి వెళ్తే మా క్లాసు లో పరువు పోతుంది .వాళ్ళు మాముల్గా చూడరు మమల్ని ...
ఎంత బ్రతిమాలిన వాడు మమల్ని బయటకి పోమ్మనాడు ..... అప్పుడు అదే administrative ఆఫీసర్ వచ్చి మమల్ని ఒకరకం గా చూసి వెళ్ళిపోయాడు ....నిన్న అంత పోగిడినావాడే ఇలా చూస్తున్నాడు ,క్లాసులో postition ఎలా వుంటున్దూ దేవుడా అనుకుంటూ వెళ్ళాం , అప్పటికే Tv9 న్యూస్ లా అందరికి చేరిపోయింది , అప్పుడు మేము సైనికుల్ల వెళ్తే ,ఇప్పుడు వాళ్ళు సైనికులలా మమల్ని పాయింట్ చేయడానికి రెడీ గా కూర్చున్నారు ..... మేము సేత్రువుల్ల లోపలి వెళ్ళాం , ఫస్ట్ టైం మా క్లాసు మాకు యుద్దభూమిలా కనిపించింది .....మేము లోపలి ఎంటర్ అవ్వగానే pindrop silence .. హమ్మయ్య అనుకోని వెళ్లి మా ప్లేసులో కూర్చున్నాం , ఇంకా ఒక అమ్మాయి వెళ్లి డోర్ క్లోజ్ చేసి వొచింది ..next సీన్ నేను చెప్పలేను ,మీరే ఊహించుకోండి ......

2 comments: