మా హాస్టల్ లో అందరికి నేను బాగా తెలుసు , ఎందుకంటే నేను ఎప్పుడు చూసిన హల్ల్లోనే కాబట్టి ....
హాల్ లో ఎందుకమ్మా నీకు రూం ఇవ్వలేద అని మీరు అడగొచ్చు ..... అసలు విషయం అది అక్దు, మా హాస్టల్ లో అందరికి కలిపి ఒకే టీవీ వుంది కాబట్టి , ఆ టీవీ హాల్ లోనే aవుంది కాబట్టి నేను ఎప్పుడు అక్కడే కుర్చుంటాను ...
నాకు ఎందుకూ చినప్పుడు నుండి టీవీ చూడడం బాగా అలవాటు ,ఎంత అంటే , ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాకూడా టీవీ చూస్తూనే వుండేదాన్ని ,ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా,కాసేపు టీవీ ఆపేసి చదువుకోవే అని చెప్తువుందేవాళ్ళు ......
నేను ఎంతో తెలివిగ చదువుకోవడానికి టీవీ ఆఫ్ చేయడం ఎందుకు ?? నేను టీవీ చూస్తూ కూడా చదువుకోగాలను అని బుక్ ముందు పెట్టుకొని మరి చూసేదాన్ని ,కాదు కూడదు అని వాళ్ళు టీవీ ఆఫ్ చేస్తే , కాసేపు బుక్ తీసేదాని ,నాకు చుట్టూ ప్రశాంతంగా వుంటే ,అంతే ప్రశాంతంగా నిద్రపోఎదాన్ని ......
కాబట్టి టీవీ ఆఫ్ చేస్తే ఇది అసలు చదవదు అని మావాళ్ళు అర్ధం చేసుకుని నీ చావు నువ్వు చావు అని వోదిలేసారు ...
అల టీవీ మాత్రమే ముక్యమైన agendaa గా పెట్టుకొని ,అల అలా ఇంజనీరింగ్ వరకు complete చేసాను ...
ఇప్పుడు చదవమనే వాళ్ళు లేరు,చదివేది లేదు , కాబట్టి హాయిగా టీవీ చూస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను .. ఈ మధ్య నార్త్ ఇండియన్ అమ్మాయిలు కూడా తెలుగు సినిమాలు బాగా చూస్తున్నారు ,అది కూడా నా పుణ్యమే అనుకోండి ....వాళ్ళకి ఎక్కడ అర్ధం కాదో అని నేను స్టొరీ shortcut లో చేపెస్తాను , అక్కడినుండి వాళ్ళకి enthu ఎక్కువ అయిపోయి ప్రతి డైలాగు ఏంటి అని అడుగుతారు , నేను frame తో frame అన్ని సీన్ లు ఇంగ్లీష్ లో చెప్పడమ స్టార్ట్ చేసాను.... ఇలా మొదలుపెట్టిన కొన్ని రోజులకి తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమా వొస్తుంటే చూడడం మానేశారు .....ఇంతకి కారణం తెలుసుకుందామని వాళ్ళని పిలిచి అడిగితే ,మేము తెలుగు సినిమా ని ఇంగ్లీష్ దుబ్బింగ్ తో చూడలేము మమల్ని వొదిలెయ్ తల్లి అని చెప్పారు (మీకు matter అర్ధం అయిందా ?? )
:D...andulo modati badhituralini nene kada.. :P
ReplyDeletehahahahha..... inka ala telugu cinemalu english loo choose badha vundadhemoo le...
ReplyDelete