Friday, July 9, 2010

మధురం... మధురం....

మధురం ...మధురం..... ఈ పాట అంటే నాకు చాల ఇష్టం .. అలాగని నేనేమి పాట ఇక్కడ రాయడం లేదు ..
ఎందుకో నాకు ఈ ఉరుకుల పరుగుల జీవితాన్ని తలుచుకుంటుంటే,నా మేధా నాకే జాలి వేసేస్తోంది ...... ఎలా వుండేదానివి ,ఎలా అయిపోయావు అని నన్ను నేనే ఊదర్చుకుంటూ వుంటాను
చిన్నగా వున్నపుడు ఎప్పుడు స్కూల్కి వెళ్తూ వుంటే , పక్కన పెద్దవాళ్ళని చూసి ,వీలపని ఎంత హాయిగా వుందో ,ఎప్పుడు ఇంట్లోనే వుంటారు ,చదవాల్సిన పని లేదు, ఎగ్జామ్స్ ,punishments , uniform ,షూస్ ,రూల్స్ ,హోమేవోర్క్ ఏమి వుండవు ......... హాయిగా హాయిగా వుంటారు అనుకునేదాన్ని ...... త్వర త్వరగా నేను కూడా పెద్ద గా అయిపోయి వాళ్ళలా ఎంజాయ్ చేయాలి అనుకునేదాన్ని ...

ఇప్పుడు పేదవాళ్ళం అయిపోయాం ,కాని అప్పుడు వున్నా ఆనందం ఇప్పుడు అసలు లేదు , అప్పుడు మన తిండి గురించి మనం పట్టించోకోవాల్సిన పనిలేదు ,చక్కగా అమ్మ ముదలు కలిపి ,బ్రతిమాలి తినిపించేది ....అప్పుడు ఈ అమ్మ ఎందుకిల చేస్తోంది ,హాయిగా నిద్రపోతోంటే ఎందుకు లేపింది ఇప్పుడు అన్నం పెడ్తోంది ,ఈ అమ్మకి ఏమి పనిలేదు అనుకొని ఎద్చుకున్తూనే తినేదాని ,కాని ఇప్పుడు తినకుండా నిద్రపోతే మనల్ని తినమనేవాళ్ళు లేరు , పాపం పిల్ల అని నిద్రలేపి తినిపించేవాళ్ళు లేరు ..... అలాగే తినకుండా నిద్రపోతే అర్ధరాత్రి ఆకలితో నిద్రలేచినపుడు అర్ధమౌతుంది అమ్మ అంటే ఏంటో... చినప్పుడు ఎప్పుడైనా ఇలాగె పడుకోనిస్తే అప్పుడే తెలుసుకునేవాళ్ళం కదా ....అన్నం విలువ ,అమ్మ మనసు ........
సాయంత్రం స్కూల్ నుండి రాగానే , మా ఊర్లో వున్నా పిల్లలందర్నీ పోగేసి ఆటలు ఆడేవాళ్ళం, ఎంతసేపు ఆదేవల్లమో మాకే తెలియదు ...ఇప్పుడు చూడండి ,మనకి టైం దొరకడమే కష్టం , దొరికినా కూడా అది ఏదో ఒక పనిచేయడానికే ఉపయోగిస్తాం ...
కనీసం schools కి halfdays ఆయినా ఉండేవి ,మన ఆఫీసులు కి ఆ పదానికి అర్ధమే తెలియదు , హాయిగా మధ్యానం వోచేసి చింతకాయలు , మామిడికాయలు అని ఇష్టం వోచినట్లు తిరిగేవాళ్ళం , ఎండలో తిరగోదు అని చెప్పే అమ్మ , పోనిలే అడుకోనివ్వు అనే నాన్న , ఇంతలో road పైనుండి వినిపించే ఐస్ క్రీం సైకిల్ వాడి బెల్ , మళ్లీ దానికోసం పరిగేతడం బలే వుంటుంది కదా .....
అల అమ్మే ఐస్ మంచిది కాదు వోదు అని పోట్లాడే అమ్మ , అమ్మ అలానే అంటుంది ,నువెల్లి కొన్నుకో అమ్మ అని డబ్బులిచ్చే నాన్న ....ఆహా !! ఏమి ఆ జీవితం !!!??? ఆ పుల్ల ఐస్ కొనుక్కొని వొచ్చి ఎంతో గర్వంగా నాన్న వొడిలో కూర్చొని ,అమ్మని వెక్కిరిస్తూ తింటుంటే ఆ ఆనందం వర్ణనాతీతం !!
అవన్నీ ఇప్పుడు ఎక్కడివి .... మనం అల వుందం అన్న ఉండలేము...
అందుకే చిన్ననాటి జ్ఞాపకాలు మధురం మధురం .... ఔనా కదా....

No comments:

Post a Comment