Monday, June 28, 2010

పాపం పిల్లి ....

నాకు మాములుగా పిల్లులు కుక్కలు లాంటి జంతువులు అంటే చచే చిరాకు !!! అలాంటిది ఈ మధ్య మా హాస్టల్ లో ఎలుకలు బాగా వోచాయి అని మా owner తెలివిగా ఒక పిల్లిని(రోడ్ పైన కనిపిస్తే , పట్టుకోచారు లెండి ) తెచ్చి ఇంట్లో పెట్టారు .... అక్కడి నుండి మొదలు కష్టాలు ..
అది ఎలుకల్ని పట్టుకోవడం అనేది జరగలేదు కాని ఎలుకలతో వోచే problems కన్నా ఎక్కువ దీనితో వున్నాయి...
ఫస్ట్ డే : ఎంతో భయం నటిస్తూ , ఎవర్ని చూసిన వెళ్లిపోయి సోఫా కింద దాక్కునేది ,soo అందరూ అప్పుడు దాని మీద జాలి పడిపోయి ,దాన్ని చాలా pamper చేసేవాళ్ళు (వాళ్ళల్లో నేను లేను సుమా) .
ఫస్ట్ వీక్ : ఒక వారం అయ్యేసరికి అది ఒక రాజులా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసింది . ఇప్పుడు పరిస్థితి తారుమారు అయిన్ధనమాట. అది జనాలకి బాగా అలవాటు పడిపోయి ఎవర్ని చూసినా మీదకి దూకడం ,కొరకటం(పాపం మొన్నే ఓక్ అమ్మాయిని కొరికింది ,తను TT కూడా చేయించుకుంది ),కనిపించిన ప్రతి వొస్తువుని నాకడం ...... ఇలా ఏవేవో చేయడం స్టార్ట్ చేసింది ....దాని టైం కి దానికి తిండి పెట్టకపోతే మాకు పెట్టె తిండి లో మూతి పెట్టడం లాంటివి అన్ని చేయడం మొదలు పెట్టింది .....మా owner కి అది ఎం చేసిన ఇష్టమే ,అది carrot లో మూతిపెడితే కడిగి దానితోనే కూర చేసి పెడతాడు ,అదేమి అని అడిగితే బయట హోటల్స్ లో ఇంతకన్నా worst గ వుంటుంది ,అక్కడ మాత్రం తింటారుగా ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు అని తలకాయలేని ప్రశ్నలు వేస్తాడు ...
అక్కడితో అది ఆగలేదు , దానికి బాత్రూం ఎంటో తెలుసా.......కొంచెం ఆలోచించండి ................
strike అవ్వలేదు కదా ...............................నేనే చెప్తాను ............... హాస్టల్ లో ఎవరి బెడ్ neat గ ఉన్నదో చూస్కొని ,వాళ్ళు bedsheet వుతికారో లేదో చెక్ చేసి , అప్పుడు దాని పైన పనులు చేస్తది అనమాట ........ రోజు సాయంత్రం వెళ్లి బెడ్ చెక్ చేస్కునే వరకు టెన్షన్....

అలా మన time బాగోక ,ఆ బెడ్ మనదే అయితే అప్పుడు మొదలు అసలు కష్టాలు .....
వెళ్లి మా owner ని అడిగితే దాన్లో ఏముంది ,బెడ్sheet రేపు వుతికిస్తాను ,బయట వేయండి అని చెప్పి సింపుల్ గ వెళ్ళిపోతాడు .... ఆ bedsheet ని మల్లి వాడాలి అంటే ఎంత కష్టంతో కూడిన పనో వాడికి తెలియదు కదా .....
దాని ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ...మాకు పెరుగు(అంటే మజ్జిగ ) ఇవ్వడానికి ఏడుస్తారు ....మార్నింగ్ టీలో నీళ్ళు మాత్రమే వుంటాయి ..మనుషులకి మాత్రం ఇంత కల్తి ఆహరం పెడతారు కాని పిల్లికి మాత్రం , ఒక్క చుక్కకూడా నీరు కలపకుండా పాలు , చికెన్ ,fish , egg ఇలా కేవలం healthy ఫుడ్ మాత్రమే పెట్టేవాడు ....దీనితో ఇది బక్కగా పీనుగులా వుండేది, ఏనుగులా అయిపోయింది ....

అది చేసే nuisance బరించలేక అందరూ గొడవపడడం మొదలు పెట్టారు ...అప్పుడు తప్పని పరిస్థితిలో దానిని వాళ్ళ అక్క ఇంటిలో పెట్టివోచాడు ......వాళ్ళు కూడా బరించలేక(వాళ్ళ అక్క తన పిల్లలకే తిండి సరిగా పెట్టదు,అలాంటిది పిల్లికి ఎం పెడ్తుంది) , garrage లో పెట్టి లాక్ చేసారంట , పాపం ఎప్పుడో ఒక కుక్క వ్చీ లాక్కుని పోయిందంట ......

మా హాస్టల్ లో వున్నపుడు , మృగరాజులా బ్రతికింది ,అక్కడికి వెళ్లి ఇలా అన్యాయంగా చనిపోయింది ...... ఆ కుక్క తినడానికే మా owner దానిని పెంచాడేమో అనిపిస్తోంది ....

ఇదంతా విని మీకేం అనిపిస్తోంది ???

2 comments:

  1. ayyo chanipoyinda???....
    owner dabbulu chusava..ela poyayo..manchiga sampadinchi..daniki pettunte bathikedi....

    ReplyDelete