ఏమిటి ఈ జీవితం అనిపిస్తోంది ?? ఎందుకు ఏమైంది అనే కదా మీ డౌట్ ... అక్కడికే వొస్తున్న......
ఈ ఉద్యోగాలు ,దాని కోసం హాస్టల్ లో నివాసాలు , ఇంటికి వెళ్ళడానికి పెద్ద పెద్ద ప్రెఅపరతిఒన్స చేసుకోవడం ,అది యదావిధిగా రద్దు కావడం ........ ఇలా విరక్తి కలిగించి విషయాలు ఎన్నో వున్నాయి ....
మరి ఇంత కష్టపడడం ఎందుకు , హాయిగా ఇంట్లో కూర్చో అనే కదా చెప్పబోతున్నారు .... ఆగండి ఆగండి .....దానికి ఒక ప్రాబ్లం వుంది ....మీరందరూ కమలహాసన్ "తెనాలి" సినిమా చూసే వుంటారు , వాడు భయం అనే ఒక పదం తీసుకొని ఎన్నో విషయాలు చెప్పాడు ....అలాగే నాకు కూడా , ప్రాబ్లం అనే టాపిక్ ఇస్తే చాలు , pages చాలవు ...బుక్స్ కావలి రాయడానికి...
ఇక్కడ వుంటే పని చేయడం తప్ప మిగతా అన్ని ప్రాబ్లెమ్స్ ee ...పొదున్న లేచినప్పటినుండి వీళ్ళు వరద బాధితులు , తిండి లేక మా దగ్గరికి వోచి వుంటున్నారు అని ఫీల్ అయ్యే మా హాస్టల్ owner(తన గురించి తర్వాత చెప్తాను,దానికి inkoo బుక్ కావలి) ,..
అక్కడ పెట్టి వుడకని కూరలు , నీళ్ళ టీ ( మిల్క్ అండ్ వాటర్ ratio 1:4 లో వుంటుంది ) ,పెరుగు అని పిలవబడే మజ్జిగ ఇలా ఎన్నో వెరైటీ లు తిని తిని విసుగు చెందిన తినక తప్పద్దు(ఎందుకంటే ఆఫీసు కాంటీన్ ఫుడ్ ఇంకా దారుణం ) కాబట్టి ఏదో ఒకటి తినేసి బయల్దేరాలి ఆఫీసు కి ..... అన్నట్లు చెప్పడం మరిచాను తినే వాటికి నామకరణం కూడా మేమే చేయాలి సుమా !! అంటే అర్ధం చేస్కొండి ,ఆ తిండి ఎలా వుంటున్దూ .....
ఇంకా ఆ యజ్ఞం ముగిసాక , ఆఫీసు బస్సు కోసం ఇంకో యజ్ఞం , 25 మంది పట్టే బస్సు లో రూజు ఒక 75 మంది కలిసిమెలసి ప్రయాణం చేస్తాం (లేదంటే ఎండలో 1.5 kms నడవాలి కదా ,అందుకే అంత unity ).. బస్సు లో వున్నా సెక్యూరిటీ మూడ్ ప్రకారం మా ప్రయాణం సాగుతుంది ...వాడికి ఇష్టం అయితే అందరిని ఎక్కనిస్తాడు ,లేదంటే 25 మంది ని లేకపెట్టి మరి డోర్ వేసేస్తాడు ,కాబట్టి అక్కడ కూడా పంపుల దగ్గర కొట్టుకొనే లేడీస్ లాగా , ఫిఘ్త్ చేసి మరి బస్సు ఎక్కాలి ...inkoo ట్విస్ట్ తెలుసా , ఇంత తన్నుకొని బస్సు ఎక్కితే దాన్లో సీట్ లు వుండవు ....ee fight అంతా కేవలం నిల్చోవదానికే సుమా !! అలా మా ప్రయాణం ముగించుకొని ఆఫీసు కి చేరతాము .......
అసలు కథ ఇక్కడే మొదలు.......!!
మళ్ళి కలుద్దాం ....
:)
ReplyDeleteగాలి వాన, వాన నీరు వరకు ok, కానీ ఈ పడవ ప్రయాణం ఎక్కడినుంచి వచ్చింది? :D
ReplyDeleteసరే విషయానికొద్దాం... same feeling... సరిగ్గా భోజనం కూడా చేయకుండా ఏంటి రా ఈ జీవితం, ఎందుకురా ఈ ఉద్యోగం అనిపిస్తుంది ఆఫీసులో భోజనం మొదలు పెట్టె సమయానికి.
ఎన్ని వేలు సంపాదించినా ఏమున్నది గర్వ కారణం... అని శ్రీశ్రీ గారి కవితను రీమేక్ చేసి రాస్కోవడం తప్ప ఏమి చేయలేని నిర్భాగ్య జీవితాలు. ఏం చేస్తాం.
(నాలా నేనొక్కణ్ణే కాదు ఇంకా చాలా మంది ఉన్నారని సర్దుకుపోవడం తప్ప) :)