Saturday, September 20, 2014

ఎండమావులు ..!!






 మనం చాలా సందర్భాలలో "అరె ఇలా జరిగిందేంటి !! అలా చేసివుంటే బాగుండేది , వాళ్ళైతే మంచిది ! అక్కడ అయితే ఈ పరిస్థితి వోచేది కాదు అని ఆలోచిస్తుంటాం . కాని మానం  చేసే ప్రతిపనికి , దాని ఫలితానికి మనమే బాధ్యులం అని ఎప్పటికి తెలుసుకుంటామో !!
జీవితంలో ఎప్పుడూ మంచే జరిగితే ఇంకా మనకి చెడుని ఎదుర్కునే దైర్యం , శక్తీ ఎప్పటికి రావు. దేవుడు మన జీవితంలో కష్టాలు సుఖాలు ముందే రాసి పెడతాడు అంట . మనం ఇక్కడేదో నష్టం వోచేలా వుంది అని ఇంకో చోటికి వెళితే అక్కడ ఇదే కష్టం రాకపోయినా , ఏదో ఒక రూపం లో మనకి పరిక్ష తప్పదు అని తెలియక మనిషి ఎడారిలో ఎండమావుల కోసం వెతుకుంటూ వెళ్ళినట్లు  వెళుతున్నాడు .... తీరా నిరాశ ఎదురై వెనక్కి తిరిగి చూసేలోపే వొచ్చిన దారి కూడా మూసుకొని పోతుంది .... !! ముందుకి ఎటు వెళ్ళాలో తెలియక ,వెనక్కి దారి లేక వొడ్డున  పడ్డ చేపలా ఔతుంది !!


Sunday, June 29, 2014

?????


మనం అనుకున్నట్లు ఎదీ జరగదు అన్నప్పుడు ... 
ఏడ్చి ఏడ్చి కన్నీటికి కూడా విసుగు తెప్పిస్తాం .... 
జీవిత ప్రయాణంలో మనతోటి ప్రయానికులంతా ఎవరి ప్రయాణం వారిదే అని తెలియచేసినప్పుడు .. 
ఒంటరి పోరాటంలో గెలవలేక ఓడలేక పోరాడలేక ... 
నీ మనసుకి ఎమి కావాలో ఏది అక్కర్లేదో తేల్చుకోలేక ... 
కొన్ని వేల సుడిగుండాలు నీ మెదడుని తినేస్తుంటే .... 
జీవితంలో ఆనందమే లేదు రాదు అని తెలిసినా ...... 
సముద్రంలో బోల్తాపడిన నావలా నీ జీవితం .. ... 
సముద్రంలో ఈత రాక ,ఈదలేక , మునిగిపోలేక నువ్వు ......  




కష్ట సుఖాలు ... !!

మనిషికి కష్టం వెనక సుఖం , సుఖం  వెనుక కష్టం పెడతాడు అంట భగవంతుడు .. అలా లేకపోతే సుఖం విలువ మనకు తెలియదు అంట ..నిజమా ???
నిజంగా అలాగే వుంటే ఎంత బాగుండు ..ఎదైన కష్టం వొస్తే ఇది తట్టుకొంటే మనకు తరువాత మంచి జరుగుతుంది అనే దైర్యం వొస్తుంది . "This too will pass on " అనే saying వింటుంటే మనిషికి ఎంత దైర్యం వొస్తుందో ..
కానీ అందరికి ఇలాంటి మంచి రోజులు రావేమో .. నేను ఇప్పటివరకు  చూసినవి ,నా స్నేహితుల అనుభవాలు గాని ఎందుకో ఇదంతా నమ్మాలని అనిపించదు . అలా అని నిరుత్సాహపడితే మనిషికి బ్రతకడమే కష్టం అయిపోతుందేమో కదా !! అలాంటి పరిస్థితి రాకూడదనే ఇలాంటివి చెప్తారేమో పెద్దవాళ్ళు ... ?? నిజమేనా ??




Thursday, March 20, 2014

మంచి మాటలు... !!

మంచి  మాటలు ఎవరు చెప్పినా నేర్చుకోవాలి అంటారు కదా .. అందుకే  ఈ మధ్య నేను విన్న కొన్ని మంచి విషయాలు అందరికి చెప్దాం అని ఈ పోస్ట్ రాస్తున్నాను ...!!
నేను కొత్తగా ఇప్పుడు ఒక హాస్టల్ లో చేరాను ,మా రూం లో ఒక అమ్మాయి దగ్గర నాకు కొన్ని విషయాలు బాగా నాచ్చాయి . ఏంటంటే తను ఎప్పుడు ఏడుపు సినిమాలు చూడదు,ఎందుకంటే లైఫ్ లో మనకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే వుంటుంది , మరి సినిమా చూసినంత సేపైనా అవన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకుంటే  మనకు వున్నా బాధలు కొంతైనా మర్చిపోతాం కదా ... ఎప్పుడైనా తన మూడ్ బాగోక పోతే ఎవరితో మాట్లాడకుండా కొంచెం సేపు కూర్చొని ,మూడ్ సెట్ అయ్యాకే పక్కన వాళ్ళతో మాట్లాడుతుంది . కోపంలో ఏదో ఒకటి అనేస్తే మనుషుల మధ్య మాటే మిగిలిపోతుంది కదా ...  
ఇది వినడానికి ఏముందిలే అనిపించినా , ఫాలో అయితే మాత్రం అద్బుతంగా  వుంటుంది .. మీరు కూడా ప్రయత్నించి చూడండి .. !!