మనం అనుకున్నట్లు ఎదీ జరగదు అన్నప్పుడు ...
ఏడ్చి ఏడ్చి కన్నీటికి కూడా విసుగు తెప్పిస్తాం ....
జీవిత ప్రయాణంలో మనతోటి ప్రయానికులంతా ఎవరి ప్రయాణం వారిదే అని తెలియచేసినప్పుడు ..
ఒంటరి పోరాటంలో గెలవలేక ఓడలేక పోరాడలేక ...
నీ మనసుకి ఎమి కావాలో ఏది అక్కర్లేదో తేల్చుకోలేక ...
కొన్ని వేల సుడిగుండాలు నీ మెదడుని తినేస్తుంటే ....
జీవితంలో ఆనందమే లేదు రాదు అని తెలిసినా ......
సముద్రంలో బోల్తాపడిన నావలా నీ జీవితం .. ...
సముద్రంలో ఈత రాక ,ఈదలేక , మునిగిపోలేక నువ్వు ......
హ్మ్... అదేదో సినిమాలో చెప్పినట్లు "పిక్చర్ అభీ బాకీ హై దోస్త్..." :-) జీవితం ఏదో ఒక క్షణంలో మనకి నచ్చినట్లుగా మారుతుందండీ.. మనం చేయవలసినదల్లా అప్పటివరకూ నమ్మకంతో ఎదురు చూస్తూ ధైర్యంగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడమే. మనిషి ఎపుడూ ఒంటరి కాదు తెలియని అదృశ్యశక్తి ఒకటి ఎప్పుడూ తోడుగా వెన్నంటి నడిపిస్తూ ఉంటుంది. హావ్ హోప్..
ReplyDeleteహహహ ఇలాంటివి చెప్పడం చాలా సులువు ఆచరించడం కష్టం అని తిట్టుకోకండి :-))
ఒకవేళ ఇది కేవలం కవిత్వమైతే ఎవరీ పిచ్చివాడు ఇంత ఓవర్ యాక్ట్ చేస్తున్నాడు అనుకుని నవ్వుకోండి :-))
--వి.
ee post katha aina kalpana aina... mee matalu matram aksharala nijam ... thanks for this.. :) #manchimatalu
ReplyDeleteకవిత్వం పోలినట్లుంది. బావుంది కూడా! పైన చెప్పిన వారిని సపోర్ట్ చేస్తానని చెప్పట్లేదు కాని కవిత్వం పరంగా, కల్పన పరంగా చూస్తె ఎంతో బావుంది. నిజ జీవితానికి పోల్చి చూస్తె మాత్రం కనెక్ట్ అవ్వదు. ఇన్ని ఆలోచనలు ఏ పనీ పాట లేని వ్యక్తివి.
ReplyDeleteఅందుకే అంటారు- వృత్తితో పాటుగా ప్రవృత్తి కూడా ఉండాలని. వృత్తి జీవితానికి పరిమితులు ఉంటాయి కాని ప్రవృత్తి జీవితానికి ఉండవు. నిన్నో స్థాయికి తీసుకెళ్ళేది ప్రవృత్తే.!
"ఇది నా ఒపీనియన్" తప్పుగా మాట్లాడి ఉంటే సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదములు.