Friday, February 4, 2011

ఆ ముగ్గురు !!!!

ఈ పోస్ట్ ముగ్గురు మహారానులకి అంకితం .... వాళ్ళు ఎవరో కాదు ,నా రూం మేట్స్ హాస్టల్ లో....
వాళ్ళలో ఒక అమ్మాయి ని ముదుగా మేము question బ్యాంకు అని పిలుస్తాము ,ఎందుకంటే మనకి అన్ని విషయాలో సందేహాలు వొస్తాయని మాకు తెలియగేసింది ఆ అమ్మాయే కదా ...మా రూం లో అందరికంటే చిన్నది ... సో అందరిని అక్కయా అని ఎంతో ప్రేమ గా పిలిచేది.. అలా వింటుంటే ఆహా మనకి ఎంత respect ఇస్తోందో అని మొదట్లో చాల హ్యాపీ గా ఫీల్ అయ్యిపోఎవాళ్ళం ....తర్వాత తర్వాత అక్క..... అనగానే ఒక రకమైన బయం మొదలయింది అందరిలో....ఎందుకంటే ఆ అమ్మాయి ప్రశ్నల వర్షం మొదలౌతుంది అని అర్ధం కాబట్టి ....దానికి తోడు శుబ్రం అనే పదాన్ని వాడటం లో దిట్ట .... పొదున్న లేవడమే ౧౦ గంటలకు నిద్ర లేచి dettol తో చేతులు కడుగుతుంది ,,,ఇంతపోదునే ఎందుకు అమ్మ అంటే , బ్రుష్ చేసుకోవాలి కదా అక్కయ అందుకే అని చెపేది ... రాత్రి నిద్రపోయి పోదున లేచే గ్యాప్ లో చేతులకి ఎం అయింది అంటే ....దానికో స్టొరీ చెప్తది...ఇంకా తర్వాత ఒక్కో పన్ను line గా తోముతుందో ఏమో సరిగా 45 నిముషాలు పల్లకి మాత్రమే concentrate చేస్తుంది .. ఇలా చెపుకుంటూ పోతే నేను రెండు రోజులు రాయాలి పోస్ట్....... :)
ఇంకో అమ్మాయి అందరిలోకి పెద్దది , తనకి పెళ్లి అయిపోయింది ..... ఈ మధ్యే జాబు change అయ్యింది ,సో ఇల్లు షిఫ్ట్ అంత టైం పడుతుంది కదా ,సూ కొన్ని రోజులు హాస్టల్ కి వొచింది అనమాట ... ఒకరు క్యూస్షన్ బ్యాంకు అయితే ,ఈ అమ్మాయి ని మేము ఎంతో ప్రేమ గా మదర్ తెరెసా అని పిలుస్తాము ... ఎందుకంటే హెల్ప్ అనకముందే పక్క మనిషికి హెల్ప్ చేస్తుంది అనమాట...తను తినకపోయినా పక్క వాళ్ళకి కొనిపెడ్తుంది ,అదేమంటే తినకపోతే ఎలా అని పెద్ద క్లాసు ఇస్తాది అనమాట...ఎవరైనా తన దగ్గర డబ్బులు తీస్కున్న వెన్నక్కి తీస్కోదు (నేను తన పేరు చెప్పను , ఆందరూ వెళ్లి డబ్బులు అడుగుదమనే గా )...
ఇంకా హాస్టల్ లో తిండి సంగతి తెలిసిందే కదా ... అందులో మా హాస్టల్ owner పెట్టె తిండి కి ఎం పేరు పెట్టాలో కూడా మాకు తెలియదు ....అలా వుంటుంది ఆ tindi .... ఇంకా ఫుడ్ బాలేని రోజు వాళ్ళ ఆయనకి చుక్కలు చూపిస్తుంది పాపం ..... ఇంకా ఎన్ని రోజులు ఇల్లు షిఫ్ట్ చేయడం ,,, ఇక్కడ నేను చ హస్తున్న తినలేక అంటూ మొదలు పెట్టి ,ఆయనకి ఒక ౧-౨ గంటల పాటు బ్రెయిన్ వాష్ చేస్తుంది .. పాపం వాళ్ళ అయన ,నాకో గుతమ బుధుడు గుర్తు వొస్తాడు .... ఇంకా ఆ అమ్మాయికి నిద్ర కూడా తిమింగ్స్ అనమాట.. 11 కి నిద్రపోయి ,ఉదయం 4 కి లేస్తుంది .... 11 అని ఎందుకు అన్నానంటే ,అప్పటి వరకు తన బెడ్ మేధా కుర్చుని వేరే వాళ్ళు టీవీ చూస్తారు ... వాళ్ళని లేవమని కూడా చెప్పడు ... అందుకే మదర్ తెరెసా అనేది మేము ....
ఇంకా మూడో అమ్మాయి వీళ్ళ ముగ్గురికంటే డిఫరెంట్.... ఎందుకంటే క్యూస్షన్ బ్యాంకు క్యూస్షన్స్ అడిగేది తననే ,అలాగే మదర్ తెరెసా కి క్లోజ్ కూడా తనే... సూ ఈ ఇదరి opposite poles ని ఫేస్ చేసేది ఆ అమ్మాయే పాపం ...ఈ పిల్ల పొదున్న భగవద్గీత క్లాసు లు వింటుంది ...తన రోజు అలా మొదలౌతుంది .... క్లాసు జరుగుతున్నంత సేపు ప్రశ్నలు అడగడం కుదరదు కదా (అడిగితే కొడ్తుంది అని తెలుసు ) అందుకే క్లాసు అవ్వగానే మా క్యూస్షన్ బ్యాంకు ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ... అది దాటుకొని ఆఫీసు కి వెళ్తే అక్కడ తనకి ఆందరూ రకరకాల మనుషులు కనిపిస్తారు ..(ఏంటో పాపం జనాలు ఆందరూ వాళ్ళ ప్రొబ్లెంస్ చెప్తూ వుంటారు, ఈ పిల్ల ఏమో వాళ్ళకి సొలుతిఒన్ దొరికేదాకా టెన్షన్ పడుతూ వుంటుంది ).... ఇంకా తిరిగి వోచాక నిద్ర పోవడానికి ఒక ౨-౩ గంటలు ప్రయత్నించి ,అతి కష్టం మీద నిద్ర పోతుంది (తనకి పిన్ డ్రాప్ silence వుండాలి అనమాట,hostels లో కష్టం కదా సో ఇలా పాట్లు పడుతూ వుంటుంది )

ఇంకా ఇలాంటివి చాల చెప్తాను ...... స్టే tuned .....


A day without laughter is a day wasted..................

No comments:

Post a Comment