Sunday, June 29, 2014

?????


మనం అనుకున్నట్లు ఎదీ జరగదు అన్నప్పుడు ... 
ఏడ్చి ఏడ్చి కన్నీటికి కూడా విసుగు తెప్పిస్తాం .... 
జీవిత ప్రయాణంలో మనతోటి ప్రయానికులంతా ఎవరి ప్రయాణం వారిదే అని తెలియచేసినప్పుడు .. 
ఒంటరి పోరాటంలో గెలవలేక ఓడలేక పోరాడలేక ... 
నీ మనసుకి ఎమి కావాలో ఏది అక్కర్లేదో తేల్చుకోలేక ... 
కొన్ని వేల సుడిగుండాలు నీ మెదడుని తినేస్తుంటే .... 
జీవితంలో ఆనందమే లేదు రాదు అని తెలిసినా ...... 
సముద్రంలో బోల్తాపడిన నావలా నీ జీవితం .. ... 
సముద్రంలో ఈత రాక ,ఈదలేక , మునిగిపోలేక నువ్వు ......  




కష్ట సుఖాలు ... !!

మనిషికి కష్టం వెనక సుఖం , సుఖం  వెనుక కష్టం పెడతాడు అంట భగవంతుడు .. అలా లేకపోతే సుఖం విలువ మనకు తెలియదు అంట ..నిజమా ???
నిజంగా అలాగే వుంటే ఎంత బాగుండు ..ఎదైన కష్టం వొస్తే ఇది తట్టుకొంటే మనకు తరువాత మంచి జరుగుతుంది అనే దైర్యం వొస్తుంది . "This too will pass on " అనే saying వింటుంటే మనిషికి ఎంత దైర్యం వొస్తుందో ..
కానీ అందరికి ఇలాంటి మంచి రోజులు రావేమో .. నేను ఇప్పటివరకు  చూసినవి ,నా స్నేహితుల అనుభవాలు గాని ఎందుకో ఇదంతా నమ్మాలని అనిపించదు . అలా అని నిరుత్సాహపడితే మనిషికి బ్రతకడమే కష్టం అయిపోతుందేమో కదా !! అలాంటి పరిస్థితి రాకూడదనే ఇలాంటివి చెప్తారేమో పెద్దవాళ్ళు ... ?? నిజమేనా ??