నాకు నిన్న ఒక్క కల వొచింది ...దాన్లో నేను ఒకరోజు గుడికి వెళ్ళాను అంట ....అప్పుడు అక్కడ రాముడు ఒక గట్టుపైన కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడట ,నేను ఆయన దగ్గరికి వెళ్లి నమస్కరించి , సహజంగా మానవులు దేవుడ్ని చూస్తే వోచే ఆశ్చర్యం ,ఆనందం అన్ని నాలోనూ కలిగాయి ,అవన్నీ ఆయనకి వివరిస్తూ వుండగా , అప్పుడు రాముడు , ఇంకా చాలు అమ్మ అసలు విషయానికి రా అని అన్నాడంట
ఇదేంటి రాముడు నేను ఇంతల చెప్తుంటే అలా అన్నాడు అని తెల్లమొహం వేసుకొని చూస్తుంటే , ఇలాంటి కాకాలు అనీ నేను ఎప్పటినుండో చూస్తూనే వున్నాను , మీరంతా ఏది చేసిన చివరికి మీరు విప్పేది మీ కోర్కెల చిట్టానే కదా !!
అందుకే అసలువిశాయానికి రా అని ముందే అడిగాను అని అన్నదంట రాముడు
అయితే నా మనసులో మాట ఈయనకి ఎలా తెలిసిందో (ఎంతైనా రాముడు కదా ) అని నేను కూడా కొంచెం తెలివిగా అలోచించి ,నేను అందరిలా కాదు , కొంచెం డిఫరెంట్ అని రాముని దగ్గర మంచిపేరు తెచుకోవాలి అని .....బాగా ఆలోచించి ఇలా మొదలు పెట్టాను ...
రామా ,నీ దయ వల్ల నాకు అన్ని వున్నాయి .... కాని నాకు కొన్ని అనుమానాలు వున్నాయి ....వాటిని నువ్వు మాత్రమే తీర్చగలవు మహానుబావ , నా సందేహాలకి సమాధానం చెప్పు అని అడిగాను
అప్పుడు రాముడు ,ఇది ముక్కు ఏది అంటే చుట్టూ తిప్పి చూపినట్లు విషయం పీకుతోంది అని మనసులో అనుకోని , దేవుడ్ని అయిన పాపానికి ఏమి చెప్పిన వినాలి కదా అనుకోని , మొదలు పెట్టమ్మ అన్నాడు...
-> నువ్వు ఏలే రాజ్యం లో ఎందుకీ ఆకలి కష్టాలు ,బాధలు అని అడిగాను ??
ఎప్పుడైతే మనిషి కోపం ,ద్వేషం ,అసూయా,అహం లాంటివి అన్ని లేకుండా బ్రతుకుతారో అప్పుడు ఎవరికీ ఈ కష్టాలో వుండవు , అలా ఎవరైనా వుంది ,వాళ్ళు బాధ పడుతుంటే నాకు చూపించు ,నేను నీ ప్రశ్న కి సమాధానం చెప్తాను అన్నారు .
నువ్వు ఎంత తెలివైన వాడివి రామ అని మనసులోనే అనుకోని , ఇంకో ప్రశ్న అడిగాను
-> పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు , మరి ఎందుకు చాల మంది చిన్నపుడే వాళ్ళ అమ్మ నాన్నని పోగొట్టుకొని ,పక్క వాడి దయదక్షిన్యాల కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతున్నారు ...
దానికి రాముడు , ఎవరైతే అల ఉంటారో వాళ్ళకి దేవుడే అమ్మ నాన్న ఔతాడు , నేను ప్రత్యేకంగా శ్రద తీసుకొని మరి ,వాళ్ళకి లోటు లేకుండా పెంచుతాను అని చెప్పాడు...
-> రోజు నీకు పూజ చేసేవాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉంటారా ?
రోజు మీరు నాకో దణ్ణం పెట్టేసి ,దేవుడు అన్ని చూసుకుంటాడు లే ,నేను ఎన్నితప్పులు చేసిన పర్లేదు అని అనుకుంటే మాత్రం తోలుతీస్తాను అని చెప్పాడు,....అమ్మో అనుకున్నాను
దేవుడిపైన బయం భక్తి ,నమ్మకం మూడు వుండాలి , ఏది లేకపోయినా ఆ పూజ వ్యర్థం అని చెప్పాడు ... ఎందుకంటే భయం వున్నవాడు ఒకసారి తప్పుచేసి అది తప్పు అని తెలిస్తే నా దగ్గరికి వ్చీ తప్పు చేసాను ,క్షమించు అని అడిగి ,మరో సారి ఇలా చేయను అని చెప్తాడు ... నిజంగానే అది మల్లి చెయ్యదు కూడా...
అలాంటివాడిని ,అంటే తప్పు తెలుసుకొని సరిదిదుకొనే ప్రయత్నం చేసేవాడిని నేను కాపాడుతాను అని చెప్పాడు.
-> అలాంటప్పుడు మేము ఎ కోరిక కోరుకున్న తీరుస్తావు కదూ ??!!
గాలిలో దీపం పెట్టి గంగానమ్మ నీదే బరం అంటే ఆవిడా మాత్రం ఎం చేస్తుంది .... అది గాలిలో కూడా వెలగాలి అంటే ,నీవు చేయి అడ్డుపెట్టి దానికి సయం చేయాలి ,అలాగే నీవు చేయాలి అనుకున్న ప్రతిపనికి నీవు చేయాల్సిన కృషి నీవు చేసి , ఆపై నామీద బారం వేసి ప్రశాంతం గా వుండు .... నీకు కావాల్సింది కచితం గా జరుగుతుంది , అంతేకాని దేవుడికి చెప్పాము కదా ,ఆయనే చూసుకున్తదులే అని గాలిలోనే దీపాన్ని వొదిలేస్తే ఏమౌతుంది ....నీ కోరికల పరిస్థితి కూడా అంతే అని చెప్పాడు..
ఇంకా ఇలాంటి questions చాలానే అడిగాను ,అవ్వన్నీ మళ్లీ చెప్తాను ....
Thursday, August 19, 2010
Tuesday, August 17, 2010
నిద్ర !!!
ప్రశాంతంగా నిద్రపోవడం అనేది గొప్ప వరం .... అని అందరు అంటుంటే ఏంటో పిచి జనాలు అనుకునేదాని కానీ అది నిజం ....
నేను చిన్నపటి నుండి ఫుల్ల్గా నిద్రపోఎదాని , ఎంతలా అంటే చుట్టూ పెద్ద పెద్ద horn లు మోగుతున్న కూడా ప్రపంచంతో సంబంధం లేకుండా పడుకునేదాని ..... evening 7 (ఇప్పుడంటే evening అని రాసానుకాని,అప్పట్లో నాకు అది నైట్ ) అయింది అంటే నేను నిద్రలో ఉండేదాని అనమాట ..... 7 తర్వాత నాకు ఈ ప్రపంచంతో పనిలేదు ...హాయిగా నిద్రపోఎదాని . ఇదే నిద్రని ఇంజనీరింగ్ అయ్యేవరకు కంటిన్యూ చేసాను ..... కాని అదేం పాపమో తెలియట్లేదు , ఇప్పుడు మాత్రం చుట్టూ pindrop silence ఉంటేగాని నిద్రపట్టడం లేదు ... ఎ రోజైతే హ్యాపీ గా 7-8 గంటలు పడుకున్తనో ఆ రోజే నాకు పండగ అనమాట .....
ఈ అలవాటు ఎందుకు వోచిందో ,ఎలా వోచిందో తెలియదు..ఎంత నిద్రలో వున్నా ,ఒక్క మెసేజ్ బీప్ కి , ఒక ప్లతే సౌండ్ కి కూడా నిద్రలేవడం అలవాటు అయిపోయింది ...అంతేనా విరమంలేకుండా ఒక 7 గంటలు పడుకుంటే తలనొప్పి వొస్తోంది .ఏంటో ఒక డ్యూటీలాగ నిద్రపోవడం నాకు నచడం లేదు...నిద్రని కూడా ఎంజాయ్ చేయాలి ...ఎలా చెప్మా??

Subscribe to:
Posts (Atom)