మనం చాలా సందర్భాలలో "అరె ఇలా జరిగిందేంటి !! అలా చేసివుంటే బాగుండేది , వాళ్ళైతే మంచిది ! అక్కడ అయితే ఈ పరిస్థితి వోచేది కాదు అని ఆలోచిస్తుంటాం . కాని మానం చేసే ప్రతిపనికి , దాని ఫలితానికి మనమే బాధ్యులం అని ఎప్పటికి తెలుసుకుంటామో !!
జీవితంలో ఎప్పుడూ మంచే జరిగితే ఇంకా మనకి చెడుని ఎదుర్కునే దైర్యం , శక్తీ ఎప్పటికి రావు. దేవుడు మన జీవితంలో కష్టాలు సుఖాలు ముందే రాసి పెడతాడు అంట . మనం ఇక్కడేదో నష్టం వోచేలా వుంది అని ఇంకో చోటికి వెళితే అక్కడ ఇదే కష్టం రాకపోయినా , ఏదో ఒక రూపం లో మనకి పరిక్ష తప్పదు అని తెలియక మనిషి ఎడారిలో ఎండమావుల కోసం వెతుకుంటూ వెళ్ళినట్లు వెళుతున్నాడు .... తీరా నిరాశ ఎదురై వెనక్కి తిరిగి చూసేలోపే వొచ్చిన దారి కూడా మూసుకొని పోతుంది .... !! ముందుకి ఎటు వెళ్ళాలో తెలియక ,వెనక్కి దారి లేక వొడ్డున పడ్డ చేపలా ఔతుంది !!