Saturday, September 20, 2014

ఎండమావులు ..!!






 మనం చాలా సందర్భాలలో "అరె ఇలా జరిగిందేంటి !! అలా చేసివుంటే బాగుండేది , వాళ్ళైతే మంచిది ! అక్కడ అయితే ఈ పరిస్థితి వోచేది కాదు అని ఆలోచిస్తుంటాం . కాని మానం  చేసే ప్రతిపనికి , దాని ఫలితానికి మనమే బాధ్యులం అని ఎప్పటికి తెలుసుకుంటామో !!
జీవితంలో ఎప్పుడూ మంచే జరిగితే ఇంకా మనకి చెడుని ఎదుర్కునే దైర్యం , శక్తీ ఎప్పటికి రావు. దేవుడు మన జీవితంలో కష్టాలు సుఖాలు ముందే రాసి పెడతాడు అంట . మనం ఇక్కడేదో నష్టం వోచేలా వుంది అని ఇంకో చోటికి వెళితే అక్కడ ఇదే కష్టం రాకపోయినా , ఏదో ఒక రూపం లో మనకి పరిక్ష తప్పదు అని తెలియక మనిషి ఎడారిలో ఎండమావుల కోసం వెతుకుంటూ వెళ్ళినట్లు  వెళుతున్నాడు .... తీరా నిరాశ ఎదురై వెనక్కి తిరిగి చూసేలోపే వొచ్చిన దారి కూడా మూసుకొని పోతుంది .... !! ముందుకి ఎటు వెళ్ళాలో తెలియక ,వెనక్కి దారి లేక వొడ్డున  పడ్డ చేపలా ఔతుంది !!


Sunday, June 29, 2014

?????


మనం అనుకున్నట్లు ఎదీ జరగదు అన్నప్పుడు ... 
ఏడ్చి ఏడ్చి కన్నీటికి కూడా విసుగు తెప్పిస్తాం .... 
జీవిత ప్రయాణంలో మనతోటి ప్రయానికులంతా ఎవరి ప్రయాణం వారిదే అని తెలియచేసినప్పుడు .. 
ఒంటరి పోరాటంలో గెలవలేక ఓడలేక పోరాడలేక ... 
నీ మనసుకి ఎమి కావాలో ఏది అక్కర్లేదో తేల్చుకోలేక ... 
కొన్ని వేల సుడిగుండాలు నీ మెదడుని తినేస్తుంటే .... 
జీవితంలో ఆనందమే లేదు రాదు అని తెలిసినా ...... 
సముద్రంలో బోల్తాపడిన నావలా నీ జీవితం .. ... 
సముద్రంలో ఈత రాక ,ఈదలేక , మునిగిపోలేక నువ్వు ......  




కష్ట సుఖాలు ... !!

మనిషికి కష్టం వెనక సుఖం , సుఖం  వెనుక కష్టం పెడతాడు అంట భగవంతుడు .. అలా లేకపోతే సుఖం విలువ మనకు తెలియదు అంట ..నిజమా ???
నిజంగా అలాగే వుంటే ఎంత బాగుండు ..ఎదైన కష్టం వొస్తే ఇది తట్టుకొంటే మనకు తరువాత మంచి జరుగుతుంది అనే దైర్యం వొస్తుంది . "This too will pass on " అనే saying వింటుంటే మనిషికి ఎంత దైర్యం వొస్తుందో ..
కానీ అందరికి ఇలాంటి మంచి రోజులు రావేమో .. నేను ఇప్పటివరకు  చూసినవి ,నా స్నేహితుల అనుభవాలు గాని ఎందుకో ఇదంతా నమ్మాలని అనిపించదు . అలా అని నిరుత్సాహపడితే మనిషికి బ్రతకడమే కష్టం అయిపోతుందేమో కదా !! అలాంటి పరిస్థితి రాకూడదనే ఇలాంటివి చెప్తారేమో పెద్దవాళ్ళు ... ?? నిజమేనా ??




Thursday, March 20, 2014

మంచి మాటలు... !!

మంచి  మాటలు ఎవరు చెప్పినా నేర్చుకోవాలి అంటారు కదా .. అందుకే  ఈ మధ్య నేను విన్న కొన్ని మంచి విషయాలు అందరికి చెప్దాం అని ఈ పోస్ట్ రాస్తున్నాను ...!!
నేను కొత్తగా ఇప్పుడు ఒక హాస్టల్ లో చేరాను ,మా రూం లో ఒక అమ్మాయి దగ్గర నాకు కొన్ని విషయాలు బాగా నాచ్చాయి . ఏంటంటే తను ఎప్పుడు ఏడుపు సినిమాలు చూడదు,ఎందుకంటే లైఫ్ లో మనకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే వుంటుంది , మరి సినిమా చూసినంత సేపైనా అవన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకుంటే  మనకు వున్నా బాధలు కొంతైనా మర్చిపోతాం కదా ... ఎప్పుడైనా తన మూడ్ బాగోక పోతే ఎవరితో మాట్లాడకుండా కొంచెం సేపు కూర్చొని ,మూడ్ సెట్ అయ్యాకే పక్కన వాళ్ళతో మాట్లాడుతుంది . కోపంలో ఏదో ఒకటి అనేస్తే మనుషుల మధ్య మాటే మిగిలిపోతుంది కదా ...  
ఇది వినడానికి ఏముందిలే అనిపించినా , ఫాలో అయితే మాత్రం అద్బుతంగా  వుంటుంది .. మీరు కూడా ప్రయత్నించి చూడండి .. !!

Friday, February 4, 2011

ఆ ముగ్గురు !!!!

ఈ పోస్ట్ ముగ్గురు మహారానులకి అంకితం .... వాళ్ళు ఎవరో కాదు ,నా రూం మేట్స్ హాస్టల్ లో....
వాళ్ళలో ఒక అమ్మాయి ని ముదుగా మేము question బ్యాంకు అని పిలుస్తాము ,ఎందుకంటే మనకి అన్ని విషయాలో సందేహాలు వొస్తాయని మాకు తెలియగేసింది ఆ అమ్మాయే కదా ...మా రూం లో అందరికంటే చిన్నది ... సో అందరిని అక్కయా అని ఎంతో ప్రేమ గా పిలిచేది.. అలా వింటుంటే ఆహా మనకి ఎంత respect ఇస్తోందో అని మొదట్లో చాల హ్యాపీ గా ఫీల్ అయ్యిపోఎవాళ్ళం ....తర్వాత తర్వాత అక్క..... అనగానే ఒక రకమైన బయం మొదలయింది అందరిలో....ఎందుకంటే ఆ అమ్మాయి ప్రశ్నల వర్షం మొదలౌతుంది అని అర్ధం కాబట్టి ....దానికి తోడు శుబ్రం అనే పదాన్ని వాడటం లో దిట్ట .... పొదున్న లేవడమే ౧౦ గంటలకు నిద్ర లేచి dettol తో చేతులు కడుగుతుంది ,,,ఇంతపోదునే ఎందుకు అమ్మ అంటే , బ్రుష్ చేసుకోవాలి కదా అక్కయ అందుకే అని చెపేది ... రాత్రి నిద్రపోయి పోదున లేచే గ్యాప్ లో చేతులకి ఎం అయింది అంటే ....దానికో స్టొరీ చెప్తది...ఇంకా తర్వాత ఒక్కో పన్ను line గా తోముతుందో ఏమో సరిగా 45 నిముషాలు పల్లకి మాత్రమే concentrate చేస్తుంది .. ఇలా చెపుకుంటూ పోతే నేను రెండు రోజులు రాయాలి పోస్ట్....... :)
ఇంకో అమ్మాయి అందరిలోకి పెద్దది , తనకి పెళ్లి అయిపోయింది ..... ఈ మధ్యే జాబు change అయ్యింది ,సో ఇల్లు షిఫ్ట్ అంత టైం పడుతుంది కదా ,సూ కొన్ని రోజులు హాస్టల్ కి వొచింది అనమాట ... ఒకరు క్యూస్షన్ బ్యాంకు అయితే ,ఈ అమ్మాయి ని మేము ఎంతో ప్రేమ గా మదర్ తెరెసా అని పిలుస్తాము ... ఎందుకంటే హెల్ప్ అనకముందే పక్క మనిషికి హెల్ప్ చేస్తుంది అనమాట...తను తినకపోయినా పక్క వాళ్ళకి కొనిపెడ్తుంది ,అదేమంటే తినకపోతే ఎలా అని పెద్ద క్లాసు ఇస్తాది అనమాట...ఎవరైనా తన దగ్గర డబ్బులు తీస్కున్న వెన్నక్కి తీస్కోదు (నేను తన పేరు చెప్పను , ఆందరూ వెళ్లి డబ్బులు అడుగుదమనే గా )...
ఇంకా హాస్టల్ లో తిండి సంగతి తెలిసిందే కదా ... అందులో మా హాస్టల్ owner పెట్టె తిండి కి ఎం పేరు పెట్టాలో కూడా మాకు తెలియదు ....అలా వుంటుంది ఆ tindi .... ఇంకా ఫుడ్ బాలేని రోజు వాళ్ళ ఆయనకి చుక్కలు చూపిస్తుంది పాపం ..... ఇంకా ఎన్ని రోజులు ఇల్లు షిఫ్ట్ చేయడం ,,, ఇక్కడ నేను చ హస్తున్న తినలేక అంటూ మొదలు పెట్టి ,ఆయనకి ఒక ౧-౨ గంటల పాటు బ్రెయిన్ వాష్ చేస్తుంది .. పాపం వాళ్ళ అయన ,నాకో గుతమ బుధుడు గుర్తు వొస్తాడు .... ఇంకా ఆ అమ్మాయికి నిద్ర కూడా తిమింగ్స్ అనమాట.. 11 కి నిద్రపోయి ,ఉదయం 4 కి లేస్తుంది .... 11 అని ఎందుకు అన్నానంటే ,అప్పటి వరకు తన బెడ్ మేధా కుర్చుని వేరే వాళ్ళు టీవీ చూస్తారు ... వాళ్ళని లేవమని కూడా చెప్పడు ... అందుకే మదర్ తెరెసా అనేది మేము ....
ఇంకా మూడో అమ్మాయి వీళ్ళ ముగ్గురికంటే డిఫరెంట్.... ఎందుకంటే క్యూస్షన్ బ్యాంకు క్యూస్షన్స్ అడిగేది తననే ,అలాగే మదర్ తెరెసా కి క్లోజ్ కూడా తనే... సూ ఈ ఇదరి opposite poles ని ఫేస్ చేసేది ఆ అమ్మాయే పాపం ...ఈ పిల్ల పొదున్న భగవద్గీత క్లాసు లు వింటుంది ...తన రోజు అలా మొదలౌతుంది .... క్లాసు జరుగుతున్నంత సేపు ప్రశ్నలు అడగడం కుదరదు కదా (అడిగితే కొడ్తుంది అని తెలుసు ) అందుకే క్లాసు అవ్వగానే మా క్యూస్షన్ బ్యాంకు ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ... అది దాటుకొని ఆఫీసు కి వెళ్తే అక్కడ తనకి ఆందరూ రకరకాల మనుషులు కనిపిస్తారు ..(ఏంటో పాపం జనాలు ఆందరూ వాళ్ళ ప్రొబ్లెంస్ చెప్తూ వుంటారు, ఈ పిల్ల ఏమో వాళ్ళకి సొలుతిఒన్ దొరికేదాకా టెన్షన్ పడుతూ వుంటుంది ).... ఇంకా తిరిగి వోచాక నిద్ర పోవడానికి ఒక ౨-౩ గంటలు ప్రయత్నించి ,అతి కష్టం మీద నిద్ర పోతుంది (తనకి పిన్ డ్రాప్ silence వుండాలి అనమాట,hostels లో కష్టం కదా సో ఇలా పాట్లు పడుతూ వుంటుంది )

ఇంకా ఇలాంటివి చాల చెప్తాను ...... స్టే tuned .....


A day without laughter is a day wasted..................

Thursday, February 3, 2011

నేను ... నా తమ్ముడు... వాడి వేషాలు ...

ఇది అందరు తప్పకుండా తెలుసుకోవలసిన కథ ,ఎందుకంటే మనిషి లైఫ్ లో vunn అన్ని phases ఈ కథలో వుంటాయి .
నాకు సాదారణంగా చిన్నప్పటి విషయాలు అంత గుర్తు వుండవు (అంటే short term memory అనమాట,ఇప్పుడు ORANGE సినిమా చూసాక అది కూడా పోయింది అనుకోండి) , అందుకే అప్పటి విషయాలు చాల తక్కువే గుర్తువున్నాయి నాకు ,... అప్పట్లో నేను స్కూల్ లో చదువుకునే రోజుల్లో ఎవరైనా బాగా చదివేవాళ్ళు వుంటే వాళ్ళని తెగ admire చేసేదాన్ని(ఒక చదువు మాత్రమే కాదు extra curriculum acitivities కూడా consider చేసేదాన్ని అన్డోయ్) ,అది నాకన్నా చిన్నవాల్లైన ,పెదవాల్లైన సరే ...దేవుడు మనకి కొంచెం ఐన అలంటి టాలెంట్ ఇస్తే బాగుండు అని అనుకుంటూ వుండేదాన్ని(అంటే మన వల్ల కానీ పనులు అన్ని దేవుడు ఇవ్వలేదు అనుకోవడం మానవుని సహజ లక్షణం కదా ) . అలా మా స్కూల్లో ఒక ముగ్గురూ నలుగురో వుండేవాళ్ళు ....నేను admire చేసేవాళ్ళు .... ఒకతను మాకన్నా 2yrs పెద్ద,స్కూల్ లో prayers conduct చేసేవాడు ,sort అఫ్ స్కూల్ representative అనమాట , అంత పెద్ద క్రౌడ్ ని ఫేస్ చేస్తున్నాడు , గ్రేట్ అనుకునే దాన్ని(అంటే ఇలాంటి విషయాల్ని కూడా admire చేస్తనన్మాట అలా ఆ లిస్టు లో ఒకడు వున్నాడు(నాకు దేవుడు ఇచిన తమ్ముడు అనమాట . ,ఇప్పుడు వీడి గురించి వినండి .... :)
నాకు తెలిసి ఎప్పుడు చదివినట్లు కనిపించేవాడు కాదు ,కానీ తెగ చదివేవాడు అని అప్పట్లో నా ఫీలింగ్ , అంటే ఎప్పుడు క్లాసులో ఫస్ట్ ఉండేవాడు అని అల అనుకునేదాని(కానీ కాదంట oneday batting అక్క అని ఈమధ్యే చెప్పాడు ) , ఇంకా తెగ అల్లరి చేసేవాడు కూడా , ఇందాక చెప్పినట్లు నాకు అలా పిల్లలు అన్ని రంగాల్లో ముందుంటే (కొంచెం heavy గ వుంది కదా ,ఫ్లోలో వొచింది ,folllow ఔతున్నా ) భలే నచేసేవాళ్ళు ,ఇంకా ఎగ్జామ్స్ లో కూడా మేము ఒకే బెంచ్ లో కూర్చునే వాళ్ళం (అంటే మా స్కూల్లో డిఫరెంట్ క్లాస్సేస్ వాళ్ళని ఒక బెంచ్ లో కుర్చోపెట్టేవాళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు ) ..... ఇంకా స్కూల్ బస్సులో కూడా మేమంతా ఒకేచోట కుర్చోనేవాళ్ళం ,విపరీతమైన అల్లరి కూడా చేసేవాళ్ళం అని నా ఫీలింగ్ ...అలా అలా రోజులు గడిచిపోయాయి , నా 10th క్లాసు అయిపోయింది .తర్వాత ఒకే ఊరిలో వున్నా కూడా మేము పెద్దగా కలిసింది లేదు మధ్య మధ్య లో ఎప్పుడైనా కలిస్తే ఏదో సోది మాట్లాడేసి వెళ్ళిపోయేవాళ్ళం ...తర్వాత నేను నా b .tech కోసం హైదరాబాద్ పట్టణంలో ప్రవేశించాను ... తర్వాత ఎప్పటికో నాకు ORKUT పుణ్యమా అని ID దొరికింది..అలా చాటింగ్ స్టార్ట్ చేసాము ... నాకు తెలిసినప్పటి enthu ఇప్పుడు లేదు... దేవుడా అంటూ ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ చెప్తూనే ఉండేవాడు , నేను వాడిని వేరేలా expect చేశాను .. ఇపాటికి వీడు ఎంత పెద్ద కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు .... ఇంకా అలాగే కాలేజీ topper ఏమో అని ఏదేదో అనుకునాను .. ఇక్కడ అంత రివర్స్లో వుంది ... ఓరి దేవుడా ,అంత active గా వుండే పిల్లలు కూడా ఇలా అయిపోతార అని అనుకున్నాను. విషయం ఏంటి అంటే వాడికి కనిపించే ప్రతిది ఒక ప్రాబ్లంగానే చూసేవాడు , తను చదివే చదువు నుండి ,తినే తిండి అన్ని అన్ని తనకి ప్రొబ్లెంస్ లాగే కనిపిస్తున్నాయి అని అర్ధం అయింది . చిన్నపుడు 100 % attendance వుండేది ,కాలేజీ కి వోచాక అది minimum కన్నా తక్కువ అనమాటకాలేజీ లో running notes రాయమని చెప్పారంట ,అది కూడా వాడికి ప్రాబ్లం , అదేమంటే స్కూల్ లాగా ఏంటి అంటాడు ....ఇలా ప్రతిచిన్న విషయాన్ని బూత అద్దంలో పెట్టి చూసి విపరీతంగా టెన్షన్ పడిపోయేవాడు .... ఒక్కోసారి వాడి మాటలు వింటే మనం కూడా ఇన్ని ప్రోబెల్మ్స్ (అంటే మాములుగా మనకి అవి ప్రొబ్లెంస్ కావు ,వాడితో కాసేపు మాట్లాడితే మనకి కూడా అన్ని ప్రొబ్లెంస్ లానే అయిపోతాయి )వున్నాయి గా అని లేనిపోనివి ఆలోచిన్చేసే లా చేసేవాడు . విషయం ఏమిటి అంటే వాడు అల ఆలోచించి టైం వేస్ట్ చేసుకొని ,హెల్త్ పాడుచేసుకొని ,చదువు మానేసి వేదవ లా తయారు అయ్యాడు .కానీ సినిమా లు చూడడం ,క్రికెట్ మ్యాచ్లు ,ఫ్రెండ్స్ తో తిరగడం ఇవన్ని మాత్రం ఏమి మానలేదు .అబ్బాయిలు ఆందరూ వెదవలు అని ఆ నిమిషం నేను declare చేశాను .లేకపోతే దేనిమీద ఇంట్రెస్ట్ వుండడం లేదు అనే వాళ్ళకి సినిమా లు క్రికెట్ ఇవన్ని ఎలా ఫాలో ఔతారు ???అప్పుడు నాకు ఇదంతా తెలియదు కదా ,పాపం వీడు ఇలా తిండి తిప్పలు మానేసి అలా సున్యం లో చూస్తూ బ్రతికేస్తున్నాడు అని తెగ ఫీల్ అయ్యేదాన్ని .ఇది కాకుండా ఒకసారి ఎప్పుడో వాళ్ళ parents ని కలిసినప్పుడు నాకో విషయం చెప్పారు , వీడు చాలా నిదానమమ్మ ,ఏదైనా కావలి అన్నా కూడా అడగడు.... నేను తీసుకొని వెళ్లి ఇచేదాక డబ్బులు కూడా అడగడు ....ఎ విషయం ఇంట్లో చెప్పడు,తనలో తనే బాధపడిపోతాడు అంటూ ఒక గౌతమ బుధుడు మా అబ్బాయి అని నాదగ్గర తెగ బాధ పడిపోయారు . వాడు ఇమేజ్ అలాంటిది మరి మా ఊర్లో ... కాని వాడు ఇలా అయిపోవడానికి కారణాలు మాత్రం అనేకం ... ఆ అనేకానేక కారణాలు నేను ఇక్కడ లిస్టు చేస్తే పెద్ద పుస్తకం ఔతుంది,నాకు దాన్లో కొన్ని valid అనిపించినవి కూడా వున్నాయి అనుకోండి .... ఏమనుకున్నాడో ఏమో ఒకసారి సడన్ గా ఎక్కడికో వెళ్ళాడు ,వాడి బాషలో మనసుకి నచింది చేయటం అంట , మన బాష లో ఇంట్లో చెప్పకుండా ఒక ఇండియా wide టూర్ కి వెళ్ళాడు అనమాట,అది కూడా ఎగ్జామ్స్ కి ౩ రోజుల ముందు , దీనితో ఎక్కడలేని టెన్షన్ అందరికి , వాడు మాత్రం హాయిగా jab వే met సినిమాలో లాగా అన్నిరకాల transportations ని హాయిగా ఎంజాయ్ చేసి ,తను చూడాలి అనుకున్న places అన్ని చూసేసి ప్రశాంతంగా ఇంటికి చేరాడు ... దారిలో వాడు ఎవరెవర్ని కలిసాడు ,వాళ్ళ దగ్గర ఏమో నేర్చుకున్నదంతా వినే ఊపిక మీకు వుంటే వాడి చేత పుస్తకయం వేయించ వోచు ...(అంటే ఎక్కువ నేర్చుకున్నాడు అని అర్ధం)....... ఇన్ని రోజులు ఇంతమంది కలిసి చెప్పినా వాడికి ఏమి బుర్రకి ఎక్కలేదు ...ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలా మాట్లాడుతూ ఉండేవాడు ....అలాంటిది అలా దేశాన్ని చుట్టి వోచేసరికి చాలా విషయాలు తెలుసుకున్నాడట ...... ఏదైతే ఏంటి ఒక ౩రోజులు తర్వాత ఇంటికి చేరాడు ...అప్పుడు నేను అయితే ఒక రూం లో పడేసి చిత్తకోట్టండి ,ఇంకోసారి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళడు అని వాళ్ళ నాన్న కి సలహా ఇదం అనుకున్న ...కాని ఎందుకు లే ఎలాగో ఇంటికి చేరాడు కదా అని అందరం ఊపిరి పిల్చుకున్నం ......ఇలా అందర్నీ ఇన్ని సంవత్సరాలు విసిగించి ,వాడు బాధ పడి చివరికి ఇప్పుడు ఒక మంచి కంపెనీ లో ఉద్యోగం కూడా తెచుకున్నాడు (మరి తెలివిగల వాడు కదా) .వాడు ఇప్పుడు hero అయిపోయాడు ,జనాలో పిచ craze అనమాట....వాడు కూడా wanted లిస్టు లో చేరిపోయాడు . ...

ఇంకా వుంది.......... :)

Thursday, August 19, 2010

రామా కనవేమిరా ...!!

నాకు నిన్న ఒక్క కల వొచింది ...దాన్లో నేను ఒకరోజు గుడికి వెళ్ళాను అంట ....అప్పుడు అక్కడ రాముడు ఒక గట్టుపైన కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడట ,నేను ఆయన దగ్గరికి వెళ్లి నమస్కరించి , సహజంగా మానవులు దేవుడ్ని చూస్తే వోచే ఆశ్చర్యం ,ఆనందం అన్ని నాలోనూ కలిగాయి ,అవన్నీ ఆయనకి వివరిస్తూ వుండగా , అప్పుడు రాముడు , ఇంకా చాలు అమ్మ అసలు విషయానికి రా అని అన్నాడంట
ఇదేంటి రాముడు నేను ఇంతల చెప్తుంటే అలా అన్నాడు అని తెల్లమొహం వేసుకొని చూస్తుంటే , ఇలాంటి కాకాలు అనీ నేను ఎప్పటినుండో చూస్తూనే వున్నాను , మీరంతా ఏది చేసిన చివరికి మీరు విప్పేది మీ కోర్కెల చిట్టానే కదా !!
అందుకే అసలువిశాయానికి రా అని ముందే అడిగాను అని అన్నదంట రాముడు
అయితే నా మనసులో మాట ఈయనకి ఎలా తెలిసిందో (ఎంతైనా రాముడు కదా ) అని నేను కూడా కొంచెం తెలివిగా అలోచించి ,నేను అందరిలా కాదు , కొంచెం డిఫరెంట్ అని రాముని దగ్గర మంచిపేరు తెచుకోవాలి అని .....బాగా ఆలోచించి ఇలా మొదలు పెట్టాను ...

రామా ,నీ దయ వల్ల నాకు అన్ని వున్నాయి .... కాని నాకు కొన్ని అనుమానాలు వున్నాయి ....వాటిని నువ్వు మాత్రమే తీర్చగలవు మహానుబావ , నా సందేహాలకి సమాధానం చెప్పు అని అడిగాను
అప్పుడు రాముడు ,ఇది ముక్కు ఏది అంటే చుట్టూ తిప్పి చూపినట్లు విషయం పీకుతోంది అని మనసులో అనుకోని , దేవుడ్ని అయిన పాపానికి ఏమి చెప్పిన వినాలి కదా అనుకోని , మొదలు పెట్టమ్మ అన్నాడు...
-> నువ్వు ఏలే రాజ్యం లో ఎందుకీ ఆకలి కష్టాలు ,బాధలు అని అడిగాను ??
ఎప్పుడైతే మనిషి కోపం ,ద్వేషం ,అసూయా,అహం లాంటివి అన్ని లేకుండా బ్రతుకుతారో అప్పుడు ఎవరికీ ఈ కష్టాలో వుండవు , అలా ఎవరైనా వుంది ,వాళ్ళు బాధ పడుతుంటే నాకు చూపించు ,నేను నీ ప్రశ్న కి సమాధానం చెప్తాను అన్నారు .
నువ్వు ఎంత తెలివైన వాడివి రామ అని మనసులోనే అనుకోని , ఇంకో ప్రశ్న అడిగాను

-> పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు , మరి ఎందుకు చాల మంది చిన్నపుడే వాళ్ళ అమ్మ నాన్నని పోగొట్టుకొని ,పక్క వాడి దయదక్షిన్యాల కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతున్నారు ...
దానికి రాముడు , ఎవరైతే అల ఉంటారో వాళ్ళకి దేవుడే అమ్మ నాన్న ఔతాడు , నేను ప్రత్యేకంగా శ్రద తీసుకొని మరి ,వాళ్ళకి లోటు లేకుండా పెంచుతాను అని చెప్పాడు...

-> రోజు నీకు పూజ చేసేవాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉంటారా ?
రోజు మీరు నాకో దణ్ణం పెట్టేసి ,దేవుడు అన్ని చూసుకుంటాడు లే ,నేను ఎన్నితప్పులు చేసిన పర్లేదు అని అనుకుంటే మాత్రం తోలుతీస్తాను అని చెప్పాడు,....అమ్మో అనుకున్నాను
దేవుడిపైన బయం భక్తి ,నమ్మకం మూడు వుండాలి , ఏది లేకపోయినా ఆ పూజ వ్యర్థం అని చెప్పాడు ... ఎందుకంటే భయం వున్నవాడు ఒకసారి తప్పుచేసి అది తప్పు అని తెలిస్తే నా దగ్గరికి వ్చీ తప్పు చేసాను ,క్షమించు అని అడిగి ,మరో సారి ఇలా చేయను అని చెప్తాడు ... నిజంగానే అది మల్లి చెయ్యదు కూడా...
అలాంటివాడిని ,అంటే తప్పు తెలుసుకొని సరిదిదుకొనే ప్రయత్నం చేసేవాడిని నేను కాపాడుతాను అని చెప్పాడు.

-> అలాంటప్పుడు మేము ఎ కోరిక కోరుకున్న తీరుస్తావు కదూ ??!!
గాలిలో దీపం పెట్టి గంగానమ్మ నీదే బరం అంటే ఆవిడా మాత్రం ఎం చేస్తుంది .... అది గాలిలో కూడా వెలగాలి అంటే ,నీవు చేయి అడ్డుపెట్టి దానికి సయం చేయాలి ,అలాగే నీవు చేయాలి అనుకున్న ప్రతిపనికి నీవు చేయాల్సిన కృషి నీవు చేసి , ఆపై నామీద బారం వేసి ప్రశాంతం గా వుండు .... నీకు కావాల్సింది కచితం గా జరుగుతుంది , అంతేకాని దేవుడికి చెప్పాము కదా ,ఆయనే చూసుకున్తదులే అని గాలిలోనే దీపాన్ని వొదిలేస్తే ఏమౌతుంది ....నీ కోరికల పరిస్థితి కూడా అంతే అని చెప్పాడు..

ఇంకా ఇలాంటి questions చాలానే అడిగాను ,అవ్వన్నీ మళ్లీ చెప్తాను ....